Homeక్రైంNizamabad City | రూ. 45 లక్షల ఏటీఎం సొమ్ముతో ఉద్యోగి పరార్​..?

Nizamabad City | రూ. 45 లక్షల ఏటీఎం సొమ్ముతో ఉద్యోగి పరార్​..?

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | ఏటీఎం మిషన్లలో డిపాజిట్​ చేయాల్సిన రూ.45 లక్షలతో సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి పరారైనట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో (Yellammagutta) ఉన్న ఓ ఏజెన్సీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్​ చేసేందుకు సదరు ఏజెన్సీకి అప్పగిస్తారు. అయితే ఓ ప్రైవేట్​ బ్యాంక్​కు చెందిన సుమారు రూ.45 లక్షలను బోధన్​లోని ఏటీఎంలలో డిపాజిట్​ చేయాల్సి ఉంది. కాగా.. ఆ డబ్బును సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై నాలుగో టౌన్​ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.