అక్షరటుడే, వెబ్‌డెస్క్: French President Emmanuel Macron : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. మాక్రాన్ దంపతులు నాలుగు రోజుల ఆగ్నేసియా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్నారు.
విమానం అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తలుపులు తెరుచుకోగానే, బ్రిగిట్టే మాక్రాన్ macron, ఆమె భర్త ముఖంపై గట్టిగా కొట్టింది. ఈ ఘటనతో మాక్రాన్ ఉలిక్కిపడ్డారు. సైలెంట్ కూడా అయ్యారు. అయితే ఆ తర్వాత తేరుకొని అందరిని పలకరించారు. కాకపోతే ఆ వీడియో మాత్రం ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తుండడంతో దీనిపై జోరుగా చర్చ కూడా నడుస్తుంది.
emmanuel macron viral video controversy explained : క్లారిటీ ఇదే..
ఈ క్రమంలో సోమవారం హనోయిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తనపై వస్తున్న వదంతులను అధ్యక్షుడు మాక్రాన్ తోసిపుచ్చారు. నేను నా భార్యతో సరదాగా చేసిన ఓ చిలిపి చేష్టకు సంబంధించిన వీడియో అది కాగా, దాన్ని పట్టుకుని కొందరు భూగోళానికి ఏదో విపత్తు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారు. దానికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయని అన్నారు. ఆ వీడియో Video నిజమే కాకపోతే దానిని కొందరు ఆయుధంగా వాడుకుంటున్నారు. కొన్ని వీడియోలని తారు మారు చేయడం వలన ప్రజలు వాటికి అన్ని రకాల అర్థం లేని విషయాలను ఆపాదిస్తున్నారు అని ఆయన తెలిపారు.
అయితే విమానంలో జరిగిన ఈ ఘటనను ఎలీసీ ప్యాలెస్ (ఫ్రెంచ్ అధ్యక్ష భవనం) మొదట ఖండించినా, ఆ తర్వాత మాత్రం కవర్ చేసే ప్రయత్నం చేసింది. మాక్రాన్‌కు సన్నిహితంగా ఉండే ఒక అధికారి సీఎన్ఎన్ అనుబంధ సంస్థ బీఎఫ్ఎం టీవీతో మాట్లాడుతూ, వారిద్దరూ కేవలం వాదించుకుంటున్నారని చెప్పారు.
అధ్యక్ష భవనంలోని మరో వ్యక్తి దీన్ని “వారిద్దరూ సన్నిహితంగా ఉన్న క్షణాలు” అని అభివర్ణించారు. ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా స్పందించారు. ఒక నెటిజన్అ అయితే సలు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య Maron Wife ఆయన ముఖాన్ని దోమను కొట్టినట్టు ఎలా కొట్టిందో చూశారా? తను ఎవరికీ కనిపించననుకుందేమో అంటూ రాసుకొచ్చాడు.