ePaper
More
    HomeజాతీయంPM Modi | భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : ప్రధాని మోదీ

    PM Modi | భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :PM Modi | భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి బుధవారంతో 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. 1975 జూన్​ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. 21 నెలల పాటు దేశంలో ఎమెర్జెన్సీ(Emergency) కొనసాగింది. 1977 మార్చి 21న ఆమె అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు.

    PM Modi | ఆ రోజులను భారతీయులు మరచిపోరు

    దేశంలో ఎమర్జెన్సీపై ప్రధాని స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌(Samvidhan Murder Day)గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందన్నారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరచిపోడని ఆయన పేర్కొన్నారు.

    PM Modi | వారికి సెల్యూట్​

    ఎమర్జెన్సీ(Emergency)కి వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధాని మోదీ సెల్యూట్​ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు..అన్ని రంగాల వారు పోరాటం చేశారన్నారు. వారి పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తేశారని మోదీ గుర్తు చేశారు. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు, అణగారిన వర్గాల కలలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.

    PM Modi | కాంగ్రెస్​ మోసాలకు గుర్తు

    ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్​ రాజ్యాంగం(Congress Constitution)లో పొందుపరచబడిన విలువలను పక్కన పెట్టిందని మోదీ అన్నారు.42వ సవరణ కాంగ్రెస్ మోసాలకు ప్రధాన ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీలో రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను పక్కన పెట్టారని, ప్రాథమిక హక్కులు నిలిపి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను తుడిచిపెట్టి, అనేక మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులను జైలులో పెట్టారన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...