ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael | అనవసర ప్రయాణాలు చేయొద్దు.. భారత పౌరులకు ఎంబసీ హెచ్చరిక

    Israel | అనవసర ప్రయాణాలు చేయొద్దు.. భారత పౌరులకు ఎంబసీ హెచ్చరిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Israel | ఇరాన్​– ఇజ్రాయెల్ (Iran – Israel) ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాల గత మూడు రోజులుగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్​లోని భారత పౌరులకు భారత ఎంబసీ (Indian Embassy) పలు సూచలను జారీ చేసింది.

    ఇజ్రాయెల్​లో ఉంటున్న భారతీయ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయాలు ఈ హెచ్చరికను జారీ చేశాయి. పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి.

    అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని పేర్కొంది. ఇజ్రాయెల్​ అధికారుల సూచలను పాటించాలని ఆదేశించింది. అప్రమత్తంగా ఉంటూ స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయంతో సంప్రదించాలని సూచించింది. భారత రాయబార కార్యాలయంలో 24 గంటలు హెల్ప్​లైన్​ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. +97254–7520711, +97254– 3278392 నంబర్లను సంప్రదించాలని కోరింది.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...