HomeUncategorizedThe America Party | అన్నంత ప‌ని చేసిన ఎలాన్ మ‌స్క్.. అమెరికాలో కొత్త రాజ‌కీయ...

The America Party | అన్నంత ప‌ని చేసిన ఎలాన్ మ‌స్క్.. అమెరికాలో కొత్త రాజ‌కీయ పార్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: The America Party | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald trump) ప్రతిపాదించిన ‘వ‌న్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను (One Big Beautiful Bill) ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు తీసుకువస్తే మూడో పార్టీ పెడతానని చెప్పిన మస్క్‌.. అన్నంత పనిచేశారు. ది అమెరికా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్​ ట్రంప్​ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన ఎలన్​ మస్క్​.. వ‌న్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంపై ట్రంప్ తీరుపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బిల్లును తీసుకువస్తే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అన్నట్లుగా ‘ది అమెరికా పార్టీ’ (The America Party) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన చేస్తూ.. ‘మన దేశాన్ని నష్టాల గుండంలోకి నెట్టే వృథా ఖర్చులు, అవినీతి చూస్తుంటే.. ఇది ప్రజాస్వామ్యం కంటే ఒకే పార్టీ పాలనలా కనిపిస్తోంది. మీ స్వేచ్ఛను తిరిగి మీకు అందించేందుకు… ఇవాళ ‘అమెరికా పార్టీ’ పుట్టింది. ఇదే మీకు కావాల్సిన కొత్త రాజకీయ పార్టీ” అని ప్రకటించారు. పార్టీకి ‘అమెరికా’ అనే పేరును ఎంచుకోవడం చర్చనీయాంశమైంది.

The America Party | కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌..

ఎలన్ మస్క్ (Elon Musk) ఎంత వ్యతిరేకించినా ‘వ‌న్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌’ను (One Big Beautiful Bill) ట్రంప్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. జులై 4న అమెరికా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల సందర్భంగా వైట్ హౌస్‌లో ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేశారు. తద్వారా, బిల్లు అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. ఇప్పటికే బిల్లు అమలుకు వ్యతిరేకంగా మస్క్ పలుమార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. “ఇలాంటి బిల్లును అమల్లోకి తేవడమంటే ప్రజల హక్కులను హరించడమే. ఇలా జరిగితే.. నేను స్వతంత్రంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను” అని తేల్చిచెప్పిన మస్క్, తన మాట నిలబెట్టుకున్నారు.

ఇప్పుడు ఆసక్తికర అంశం ఏమంటే.. మస్క్ ప్రకటించిన ‘ది అమెరికా పార్టీ’ (The Amerca PArty) రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపగలదు? మస్క్ వ్యక్తిగత పాపులారిటీకి రాజకీయ మద్దతు ల‌భిస్తుందా? అనే ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి. ఇక ట్రంప్, మస్క్‌ల మధ్య ఈ రాజకీయ వివాదం మరింత రసవత్తరంగా మారనుంది. అయితే సోషల్‌ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన మస్క్‌, ఎక్స్‌ వినియోగదారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడం వ‌ల్ల‌నే తారు ఈ నీర్ణయం తీసుకున్నట్లు స్ప‌ష్టం చేశారు.