అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద చేరి, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ప్రజా రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లారెడ్డి జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఉప్పొంగిన చెరువులు, వాగులు రహదారులను ఛిద్రం చేశాయి. భారీ వరద దాటికి ఎక్కడికక్కడ రహదారులు కోతకు గురయ్యాయి.
YEllaReddy in waterlogging | బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు..
ఎల్లారెడ్డి – కామారెడ్డి Kamareddy రోడ్డుపై వడ్డెర కాలనీ డిగ్రీ కాలేజ్ హాజీపూర్ కొట్టాల్ వద్ద రోడ్డు, కల్వర్టు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కామారెడ్డికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇటు హైదరాబాద్ Hyderabad వెళ్లేందుకు బంజార తండా వద్ద రోడ్డుపై నీరు నిలిచింది. పోచారం బ్రిడ్జికి రెండు వైపులా రోడ్డు కొట్టుకపోయింది. దీంతో ఈ మార్గంలోనూ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇటు నిజామాబాద్ Nizamabad – బాన్సువాడ Banswada కు వెళ్లే మార్గంలో కళ్యాణి ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోవడంతో పాటు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారిలోనూ రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది.
ఇటు శివాపూర్ వద్ద రోడ్డుపై కూడా భారీ వరద నీరు ప్రవహిస్తూ గండి పడటంతో బొల్లారం వైపు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంది.
ఇలా ఎల్లారెడ్డి Yellareddy నుంచి ఏ ప్రాంతానికి కూడా వెళ్లకుండా దారులన్నీ తెగిపోయాయి. దీంతో దారులన్నీ మూసుకుపోయి ఎల్లారెడ్డి జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది.
ఎల్లారెడ్డిలో రహదారులతోపాటు తిమ్మాపూర్, లక్ష్మాపూర్ తాటివాని మత్తడి చెరువులు కొట్టుకుపోవడంతో భారీ నష్టం వాటిల్లింది.
హాజీపూర్ వద్ద పోచారం ప్రధాన కాలువకు గండిపడి కట్టకిందకు రాకపోకలు నిలిచిపోయాయి. తిమ్మారెడ్డి లో లెవల్ వంతెన వద్ద సైతం దారి కొట్టుకుపోవడంతో తిమ్మారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి.
YEllaReddy in waterlogging | కూలిన ఇళ్లు..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో 10 గృహాలు కూలిపోయాయి. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరద నీరు చేరి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
దెబ్బతిన్న పంటలు, కూలిన గృహాలను, చెరువులను, తెగిన రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. నీటి ప్రవాహాలు తగ్గాక రాకపోకలు పునరుద్ధరిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మదన్మోహన్ స్పష్టం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు.