HomeతెలంగాణEli Lilly Company | తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలి లిల్లీ...

Eli Lilly Company | తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలి లిల్లీ ఫార్మాసంస్థ

అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్​రెడ్డితో సమావేశం అయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eli Lilly Company | ప్రముఖ ఫార్మా సంస్థ ఎలి లిల్లీ రాష్ట్రంలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)తో ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం సమావేశం అయ్యారు.

హైదరాబాద్ (Hyderabad)​లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్ ఇతర ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)​ సైతం పాల్గొన్నారు. ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్ కేంద్రంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అందుకోసం సుమారు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది.

Eli Lilly Company | కాంట్రాక్ట్​ మ్యాన్యుఫాక్చరింగ్​ ద్వారా..

సీఎంతో చర్చల అనంతరం ఎలీ లిల్లీ కంపెనీ ప్రతినిధులు తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ ఎత్తున కార్యకలాపాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ ద్వారా సంస్థ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి విస్తరించాలన్న నిర్ణయంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

Eli Lilly Company | పరిశ్రమలకు మద్దతు

సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని తెలిఆపరు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్‌ (Pharma Hub)గా ప్రఖ్యాతి గడించిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షిస్తోందన్నారు. ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌ (IDPL)ను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఫార్మా రంగం విస్తరించిందని ఆయన గుర్తుచేశారు. దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Eli Lilly Company | భారీగా ఉద్యోగావకాశాలు

ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ ద్వారా రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్‌మెంట్ నిపుణులు, ఇంజినీర్ల పోస్టులను ఆ సంస్థ భర్తీ చేసే అవకాశం ఉంది. కాగా అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీ 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. దేశంలోని గురుగ్రామ్, బెంగుళూరులో ఎలి లిల్లీ ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్​లో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.