ePaper
More
    Homeభక్తిJagannath Rath Yatra | రథయాత్రలో భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. తప్పిన ప్రమాదం

    Jagannath Rath Yatra | రథయాత్రలో భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరిలో శుక్రవారం జగన్నాథుడి రథయాత్రను వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు రథయాత్ర కోసం ఇప్పటికే పూరి చేరుకున్నారు. పూరితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైతం జగన్నాథుడి రథయాత్ర(Jagannath Rath Yatra) నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గుజరాత్​లోని అహ్మదాబాద్(Ahmedabad)​లో నిర్వహించిన రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. మూడు ఏనుగులు అదుపు తప్పి భక్తులపై దూసుకెళ్లాయి.

    అహ్మదాబాద్‌లో ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మూడు విగ్రహాలను (జగన్నాథ్, బలభద్రుడు, సుభద్ర) రథంపై కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పహింద్(Chief Minister Bhupendra Patel Pahind) రథయాత్రను ప్రారంభించారు. ఇది 148వ రథయాత్ర కావడం గమనార్హం. యాత్ర కోసం అధికారులు 17 ఏనుగులను తీసుకొచ్చారు. ఇందులో మూడు ఏనుగులు(Elephants) అదుపు తప్పి భక్తులపై దూసుకెళ్లాయి. ఈ ఘటన ఖాడియా కూడలి సమీపంలో చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు(Devotees) స్వల్పంగా గాయపడ్డారు. అయితే పెద్దగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

    అనంతరం జూ అధికారులు వచ్చి ఏనుగులను అదుపు చేశారు. అనంతరం ఒక మగ మరియు రెండు ఆడ ఏనుగులను ఊరేగింపు నుంచి బయటకు తీసుకెళ్లారు. 14 ఏనుగులతో రథయాత్రను కొనసాగించారు. కాగా.. రథయాత్రలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah) తన కుటుంబంతో కలిసి జమల్‌పూర్ జగన్నాథ ఆలయం(Jamalpur Jagannath Temple)లో మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 8:30 గంటలకు స్వామివారు ఆలయానికి తిరిగి వస్తారు.

    Latest articles

    Team india | శ్రేయాస్ అయ్య‌ర్‌కి నో ఛాన్స్.. ఆసియా క‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025...

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​, సర్వేయర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని...

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. శ్రీవాణి దర్శన కోటా టికెట్ల పెంపు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. భక్తుల...

    Nizamsagar Project | ఆరేడు వరద గేట్ల ఎత్తివేత.. తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (Nizamsagar Project) పరిధిలోని ఆరేడు గ్రామ శివారులో...

    More like this