అక్షరటుడే, ఇందూరు : Electricity Department | గ్రామాల్లో,, పట్టణాల్లో మూడు రోజులపాటు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ నిర్వహించాలని వరంగల్ ఆపరేషన్స్ సీఈ అశోక్ ఆదేశించారు. నగరంలోని పవర్ హౌస్‌లోని గోల్డెన్ జూబ్లి హాల్లో (Golden Jubilee Hall) అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
Electricity Department | మంగళ, గురు, శనివారాల్లో..
గ్రామాల్లో, పట్టణాల్లో వారానికి మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో ఏఈ స్థాయి అధికారులు తమ సిబ్బందితో కలిసి ప్రజాబాట నిర్వహించాలని సీఈ సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ డ్యామేజ్, అలాగే లూజ్ కనెక్షన్లు, చెట్లకొమ్మలు తొలగించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్లు పూర్తి చేయాలని, డీటీఆర్ ఫెయిల్యూర్స్ (DTR Failures)ను తగ్గించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
సాధ్యమైనంత వరకు విద్యుత్ సరఫరాలో (Power Supply) అంతరాయాలు తగ్గించేందుకు ట్రాన్స్ఫార్మర్లు పాడవకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలన్నారు. సమావేశంలో డీఈ టెక్నికల్ రమేష్, ఎస్ఏవో శ్రీనివాస్ డీఈలు ఎం.శ్రీనివాస్, ఎండీ ముక్తార్, ఎండీ ముక్తార్ రఘు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.