అక్షరటుడే, ఇందూరు: Electricity Private Bill | ఎలక్ట్రిసిటీ ప్రైవేటు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అండ్ ఎంప్లాయీస్ జిల్లా జేఏసీ (Electricity Engineers and Employees JAC) ఛైర్మన్ రఘునందన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్‌లో (Nizamabad Power House) గురువారం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
Electricity Private Bill | విద్యుత్ సంస్థలను ప్రైవేట్ చేయవద్దు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలను (Electricity companies) ప్రైవేటుపరం చేయవద్దన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరింంచారు. ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగస్తులకు కుటుంబాలు వీధిపాలవుతాయని తక్షణమే విద్యుత్తు అమెండ్మెంట్ బిల్‌ను(Electricity Amendment Bill) నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి పూదరి గంగాధర్, అల్జాపూర్ రమేష్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, జేఏసీ నాయకులు ప్రసాద్ రెడ్డి, రాజేందర్, కాశీనాథ్, సురేష్ కుమార్, గంగారాం నాయక్, చంద్రశేఖర్, శ్రీనివాస్, చాంద్ పాషా, శివాజీ, నగేష్ కుమార్, శ్రీనివాస్, పిరాజీ వెంకట్ ప్రసాద్, మిథున్, రాజేందర్ గౌడ్, వేణుగోపాల్, బీసీ రాజు, వేణు, మొయినుద్దీన్, శివ ప్రసాద్, నరేందర్ నాయక్, రాజేశ్వరి, విజయ, శాంతా కుమారి, పద్మ, సుమారు 300 మంది ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు.