అక్షరటుడే, ఇందూరు: Electricity Department | రాబోయే రోజుల్లో భారీ వర్షసూచనలు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శాఖలవారీగా అధికారులు ముందస్తు చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. కలెక్టరేట్లో (Nizamabad Collectorate) ప్రత్యేక కంట్రోల్‌రూంను (Control room) సైతం ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో విద్యుత్‌శాఖ నుంచి అధికారులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
షిఫ్టులవారీగా అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు తోట రాజశేఖర్ (Thota Raja sekhar), లక్ష్మణ్ నాయక్, పి.రవి, ఎస్.రవి విధులు నిర్వహిస్తున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08462 -22183 కు సమాచారం అందించాలని కోరారు.