అక్షరటుడే, వెబ్డెస్క్: DA Hike | రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు (electricity employees) కీలక వార్త చెప్పింది. 17.6 శాతం డీఏకు ఆమోదం తెలిపింది.
విద్యుత్ శాఖ (electricity department) ఉన్నతాధికారులు 17.651 శాతం డీఏ కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) సోమవారం ఆమోదం తెలిపారు. పెరిగిన డీఏ జులై 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో విద్యత్ శాఖలో పని చేస్తున్న 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుపై విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
DA Hike | ఉద్యోగుల వివరాలు
ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులలు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు డీఏ పెరుగుదల అమలులోకి రానుంది. జెన్ కోలో 6,913 మంది ఉద్యోగులు, 3,579 మంది పెన్షనర్లు, 3,583 మంది ఆర్టిజన్లు ఉన్నారు. ఎస్పీడీసీఎల్లో 11,957 మంది ఉద్యోగులు, 8,244 మంది ఆర్టిజన్లు, 8,244 మంది పెన్షనర్లు, టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులు, 6,115 మంది పెన్షనర్లు, 3,465 మంది ఆర్టిజన్లు పెరిగిన డీఏతో లబ్ధి పొందనున్నారు.