Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | ఇందిరమ్మ ఇంటికి ఫైన్ వేసిన విద్యుత్​ శాఖ.. ప్రజావాణిలో ఫిర్యాదు...

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇంటికి ఫైన్ వేసిన విద్యుత్​ శాఖ.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు

ఇందిరమ్మ ఇంటికి విద్యుత్​శాఖ అధికారులు ఫైన్​ వేశారు. దీంతో బాధితుడు కామారెడ్డి కలెక్టరేట్​లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇందిరమ్మ ఇంటికి నిర్మించుకుంటే ఆ ఇంటికి ఫైన్​ కట్టాలని పేర్కొంటూ విద్యుత్​శాఖ (Electricity Department) నోటీసు పంపింది. దీంతో అవాక్కయిన బాధితుడు కామారెడ్డి కలెక్టరేట్​లోని (Kamareddy Collectorate) ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం (Gandhari mandal) ముదెల్లి గ్రామానికి చెందిన వడ్నాల హన్మాండ్లు అతని భార్య నిరీష పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా.. పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇప్పటికే స్లాబ్ లెవల్ వరకు ఇల్లు పూర్తి కాగా రెండు బిల్లులు కూడా వచ్చాయి.

అయితే నెల రోజుల క్రితం గ్రామానికి వచ్చిన విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు హన్మాండ్లు ఇంటికి వచ్చారు. ఇంటి నిర్మాణానికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నారని కేసు నమోదు చేస్తామని చెప్పారు. పాత ఇంటికి తన తల్లి సత్తవ్వ పేరున ఉన్న విద్యుత్ మీటర్​ను ఇందిరమ్మ ఇంటికి (Indiramma house) బిగించి విద్యుత్ వాడుకుంటున్నానని బాధితుడు తెలిపాడు.

అయితే ఆ మీటర్ చెల్లదని, కేటగిరీ–2 కింద కొత్త మీటర్ తీసుకోవాలని లేకపోతే తమకు రూ.10వేలు ఇస్తే కేసు లేకుండా చూస్తామని విద్యుత్​ సిబ్బంది చెప్పారని బాధితుడు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటికి ఉచిత మీటర్ ఉంటుందని చెప్పినా వినిపించుకోకుండా రూ.10వేలు ఇవ్వకపోవడంతో రూ.7,851 జరిమానా విధించారని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ఆయన ప్రజావాణిలో వేడుకున్నాడు.