అక్షరటుడే, కామారెడ్డి: Electricity Department | అతివేగంగా వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి(Devunipalli) వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విద్యుత్ శాఖలో (Electricity Department) సబ్ ఇంజినీర్‌గా (Sub Engineer) పని చేస్తున్న శివతేజ పని నిమిత్తం తాడ్వాయి నుంచి కామారెడ్డి వెళ్తున్నారు. కారు దేవివిహార్ (Devi Vihar) వద్దకు వెళ్లగానే కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయి కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. కారు నడుపుతున్న శివతేజకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Home జిల్లాలు కామారెడ్డి Electricity Department | కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. ట్రాన్స్‌కో సబ్ఇంజినీర్కు గాయాలు