అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని వీకేవీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏడీఈ ప్రసాద్‌రెడ్డి (ADE Prasad Reddy), ఏఈ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎల్లారెడ్డి సబ్ డివిజన్ (Yellareddy sub-division) పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యుత్ బిల్లులకు సంబంధించి, లేదా లోవోల్టేజ్, మీటర్ రీడింగ్, ఇతర సమస్యలతోపాటు కొత్త కనెక్షన్లకు సంబంధించి సమస్యలు వేదికలో పరిష్కరించుకోవచ్చని సూచించారు.