అక్షరటుడే, ఇందూరు: Electricity Department | విద్యుత్ సవరణ బిల్లును తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఐఎన్టీయూసీ(INTUC) రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఐఎన్టీయూసీ రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్, పోతంగల్ లైన్ ఇన్స్పెక్టర్ (Line Inspector) మీరా ఉద్యోగ విరమణ మహోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యుడు ఉన్నన్ని రోజులు విద్యుత్ సంస్థలు ఉండాల్సిందేనని.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తెరగాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు (Electricity Amendment Bill) ఉద్యోగులకు శాపం లాంటిదన్నారు. విద్యుత్ సంస్థను అంబానీకి అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తుందని ఆరోపించారు.
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి విద్యుత్ సంస్థ వెళ్లిపోతే వినియోగదారుడిపై విపరీతమైన భారం పడుతుందని.. సబ్సిడీలు ఎత్తివేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకే లైన్ ఇన్స్పెక్టర్ మీరాను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యోగ సమయంలో ఉత్తమ సేవలు అందిస్తే ప్రజలు జీవితకాలం గుర్తించుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూదరి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, నిజామాబాద్ జిల్లా ఎస్ఈ రాపల్లి రవీందర్ బోధన్ ఆపరేషన్ మమ్మద్ ముక్తార్, ఏడీఈ తోట రాజశేఖర్, నగేష్ కుమార్, ఏవో శివాజీ గణేష్, ఏఈ ఫక్రుద్దీన్, ఐఎన్టీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి మెహర్ బాబా, బోధన్ కార్యదర్శి గంగాధర్, బోధన్ డివిజన్ ఇంజినీర్స్ కార్మికులు ఉద్యోగులు, వినియోగదారులు రైతులు 500మంది పాల్గొన్నారు.
