అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో పర్యావరణహిత(environmentally friendly) ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీల)electric vehicles (EVs) సంఖ్య రెండు లక్షల మైలురాయి దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.96 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్ ఆఖరు నాటికి ఈ సంఖ్య రెండు లక్షలు దాటినట్లుగా రవాణాశాఖ(Transport department) అధికారులు వెల్లడించారు.
మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా (80 శాతానికిపైగా) ద్విచక్ర వాహనాలు ఉండగా.. తర్వాతి స్థానంలో కార్లు స్థానం సంపాదించాయి. ఈవీలతో యజమానులతోపాటు పర్యావరణానికీ మేలు జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో పోల్చితే విద్యుత్తు ఛార్జింగ్‌తో ఖర్చు ఆదా అవుతుంది.
Electric vehicles : పెరుగుతున్న ఈవీల సంఖ్య
పెట్రోల్(petrol), డీజిల్(diesel)తో నడిచే వాహనాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు గాలిని కలుషితం చేస్తాయి. ఈవీలతో ఈ సమస్యలు ఉండవు. కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ నూతన పాలసీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల పెరుగుదలకు మరింత దోహదం చేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి రోడ్‌ట్యాక్స్(road tax), రిజిస్ట్రేషన్(registration fees) ఫీజులపై తెలంగాణ సర్కారు(Telangana government) మినహాయింపు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు డిసెంబరు 31, 2026 వరకు అమల్లో ఉంటాయి. ఈ కారణంగా వ్యక్తిగత వాహనాలతోపాటు ఆర్టీసీలోనూ ఈవీల సంఖ్య పెరుగుతోంది.
Electric vehicles : ఛార్జింగ్ స్టేషన్లే ప్రధాన సమస్య
ఈవీలకు ఛార్జింగ్ స్టేషన్ల కొరత సమస్యగా మారిందనే చెప్పాలి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు జిల్లాకేంద్రాలు, జాతీయ రహదారుల్లోని(ఎన్‌హెచ్‌ల) National Highways (NHs) ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, సెమీఅర్బన్ ప్రాంతాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉంది. ఈ కారణంగా ఇప్పటికే ఈవీలు ఉన్నవాళ్లు మార్గమధ్యలో ఆగి తమ వాహనాలకు కొన్ని గంటలపాటు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య కారణంగానే గ్రామీణ, సెమీఅర్బన్(semi-urban) ప్రాంతాలవారు ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాల) కొనుగోలుకు అంతగాఆసక్తి చూపడం లేదు.
Electric vehicles : ప్రస్తుతం 800 స్టేషన్లే
ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీలకు)electric vehicles (EVs) సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 800 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఫలితంగా ఇంటినుంచి బయలుదేరేటప్పుడు పూర్తిగా ఛార్జింగ్ పెట్టి మార్గమధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్‌పెట్టిస్తే కానీ, ఇంటికి చేరుకోలేని పరిస్థితి ఉంటోంది.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 (Clean and Green Energy Policy-2025)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2030 నాటికి 6 వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. 2035 నాటికి ఈ సంఖ్య 12 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరినాటికి ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 3 వేలకు పెంచాలనేది లక్ష్యం.