Homeజిల్లాలుకామారెడ్డిJukkal | ప్రాణాలు తీసిన కూలర్​​.. విద్యుత్​ షాక్​తో తల్లీకూతుళ్ల మృతి

Jukkal | ప్రాణాలు తీసిన కూలర్​​.. విద్యుత్​ షాక్​తో తల్లీకూతుళ్ల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jukkal | వేసవి కాలంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్​ వారి పట్ల మృత్యుపాశం అయింది. ఎయిర్​ కూలర్​కు విద్యుత్​ షాక్​ (air cooler electric shock) రావడంతో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన జుక్కల్​ మండలం పెద్దగుల్ల తండాలో (jukkal mandal, peddagulla thanda) శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకబాయి(34), ఆమె కూతురు శివాని(14) రాత్రి కూలర్​ ఆన్​ చేసి నిద్రించారు. కూలర్​లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్​ సరఫరా అయింది. శివాణి కాలు రాత్రి కూలర్​ నీటితొట్టెలో పడింది. దీంతో ఆ నీటిలో విద్యుత్​ ప్రవహించి ఆమె కాలు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లికి కూడా షాక్​ కొట్టడంతో ఆమె మృతి చెందింది. శంకబాయి కొడుకు ప్రతీక్ బయట పడుకోవడంతో తప్పించుకున్నాడు. ఉదయం లేచి చూసిన ప్రతీక్​ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Must Read
Related News