అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kasturba Vidyalaya Electric shock | విద్యార్థులు విద్యుఘాతానికి గురయ్యారు.. ఒకేసారి ముప్పై మంది బాలికలకు కరెంట్ షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram district) గుర్ల మండలం (Gurla Mandal) కస్తూర్బా బాలికల విద్యాలయం Kasturba Girls’ School (KGBV)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ బడిలోని సుమారు 30 మంది బాలికలు విద్యుత్తు షాక్కు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, అధికారులు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Kasturba Vidyalaya Electric shock | విద్యుత్తు తీగ తెగిపడి..
విద్యాలయం గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్తు స్తంభం నుంచి ఒక కరెంటు తీగ తెగిపడి, గోడకు అనుకొని ఉన్న తరగతి గదికి విద్యుదాఘాతం Electric shock ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదం సమయంలో 30 మంది వరకు అమ్మాయిలు గోడను పట్టుకొని ఉండటంతో.. వారందరికి ఏకకాలంలో కరెంట్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన బాలికల్లో ఐదుగురి పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి (Vizianagaram Government Hospital) కి తరలించారు.
మరికొందరు బాలికలకు నెల్లిమర్లలోని సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యా, విద్యుత్తు శాఖల అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. తగు చర్యలు చేపట్టారు.
