అక్షరటుడే, నిజాంసాగర్: RTC Electric Bus | నిజామాబాద్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గురువారం నిజామాబాద్ నుంచి బాన్సువాడకు (Banswada) ప్రయాణిస్తున్న ఓ ఎలక్ట్రిక్ బస్సు మధ్యలోనే మొరాయించింది. దీంతో ప్రయాణికులు మరో బస్సులో బాన్సువాడకు చేరుకున్నారు.
నిజామాబాద్ డిపోకే చెందిన మరో బస్సు హైదరాబాద్(Hyderabad) వెళ్తుండగా, బాన్సువాడ బస్టాండ్లో మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సంబంధిత అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.