అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | అందరి సహకారంతో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం నోడల్ అధికారులను, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావును సత్కరించారు.
Collector Nizamabad | సమిష్టి కృషితో..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో కృషి చేయడంతో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగాయని కలెక్టర్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ (Local Body Elections) ఇదే తరహాలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.