అక్షరటుడే, ఇందల్వాయి: Dichpally CI | డిసెంబర్ 14న జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డిచ్పల్లి సీఐ వినోద్ (Dichpally CI Vinod) సూచించారు.
ఈ మేరకు ఇందల్వాయి మండలంలోని గన్నారంలో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దన్నారు. గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతేకాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల (cyber crimes) గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. తాగి వాహనాలు నడిపే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందన్నారు. ఈవ్ టీజింగ్, డ్రగ్స్ తదితర విషయంలో కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇందల్వాయి ఎస్సై జి.సందీప్, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.