- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Padmashali Hostel | పద్మశాలి విద్యార్థి వసతి గృహానికి ఎన్నికలు నిర్వహించాలి

Padmashali Hostel | పద్మశాలి విద్యార్థి వసతి గృహానికి ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Hostel | పద్మశాలి వసతి గృహం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని పద్మశాలి హాస్టల్ ఎన్నికల పోరాట కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం వసతి గృహ అధ్యక్షుడు రచ్చ మురళికి, నగర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్​కు మెమోరాండం అందజేశారు. అనంతరం పోరాట కమిటీ ప్రతినిధులు భీమర్తి రవి, బొట్టు వెంకటేష్, కొండి రమేష్, సిలివేరి గణేష్, కోట నాగేష్ మాట్లాడుతూ.. పద్మశాలి విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాలపరిమితి పూర్తయి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. పద్మశాలి విద్యార్థి వసతి గృహం ఎన్నికల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలని కోరారు.

Padmashali Hostel | జనరల్​ బాడీ మీటింగ్​లో నిర్ణయించినప్పటికీ..

2025 జనవరి 26న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో (General Body Meeting) ఏప్రిల్​ 13న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. నగర సంఘం ఎన్నికలు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా విద్యార్థి వసతి గృహానికి ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమనన్నారు. దీని మూలంగా పద్మశాలి వసతి గృహ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి కలావిహీనంగా మారిందని పేర్కొన్నారు. ఇకనైనా వసతిగృహ​ అధ్యక్షుడు నిర్ణయం వెల్లడించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో నాయకులు గాలిపల్లి రవీందర్, గోంట్యాల రమేష్, పెంటి బాలరాజ్, కారంపూడి వెంకటి, సురకుట్ల విజయ్, అంకం రాజేందర్, కోడూరు నాగరాజు, ఎర్రగుంట లక్ష్మణ్, సిరిగాధ మనోహర్, తలకొక్కుల సతీష్, భోగ మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News