అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Elections | ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పోలింగ్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బుధవారం రాజంపేట్, దేవునిపల్లి (Devunipalli) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్లను పరిశీలించారు.
Panchayat Elections | 157 జీపీల్లో ఎన్నికలు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో మొత్తం 167 జీపీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 11 పంచాయతీలలో ఏకగ్రీవం కావడంతో 157 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 1,457 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 2,48,668 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,18,342, మహిళా ఓటర్లు 1,30,322, ఇతరులు నలుగురు ఉన్నారని తెలిపారు. 1,457 పోలింగ్ కేంద్రాల్లో 1,848 మంది పోలింగ్ అధికారులు (Polling Officers) , 2,501 ఇతర పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
Panchayat Elections | పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.
Panchayat Elections | సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూడాలి
సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. తాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, అడ్డంకులు లేకుండా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.