- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Pothangal mandal | కల్లూరు గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గం ఎన్నిక

Pothangal mandal | కల్లూరు గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Pothangal mandal | పోతంగల్ మండలం కల్లూరులో (Kallur) గ్రామాభివృద్ధి కార్యవర్గ ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న 18 కులాలు కలిసి ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పాశపు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా శ్రవణ్, సెక్రెటరీ గోపాల్​ను ఎన్నుకోవడం జరిగింది.

ప్రతి మూడేళ్లకొకసారి గ్రామ అభివృద్ధి కమిటీని (Village Development Committee) ఎన్నుకోవడం జరుగుతుందని గ్రామస్థులు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బాలకృష్ణ మాట్లాడుతూ.. గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, లింగప్ప, రాంరెడ్డి, మక్కయ్య, కుల సంఘాల సంఘాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News