అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | రెవెన్యూ ఎంప్లాయీస్ (Revenue Employees) సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు.
రాష్ట్ర కమిటీ నుంచి నారాయణరెడ్డి ఎన్నికల అధికారిగా, నిరంజన్‌రావు ప్రత్యేక ఎన్నికల అధికారిగా వ్యహరించారు. కార్యవర్గ సభ్యులందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమణ్‌కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులుగా ప్రభు, శశి భూషణ్, శైలజ, వినయ్ సాగర్ ఎన్నికయ్యారు.
జనరల్ సెక్రెటరీగా ప్రశాంత్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా వసంత్‌రావు, భరద్వాజ్, సంయుక్త కార్యదర్శులుగా రాజశేఖర్, సవిత, రాము, శ్రవణ్‌కుమార్, గంగరాజం, కోశాధికారిగా విజయ్‌కాంత్ రావు ఎన్నికయ్యారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కలెక్టర్ కార్యాలయం డివిజన్ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.