Homeజిల్లాలుకామారెడ్డిKotagiri | సార్వజనిక్ దుర్గామాత నూతన కమిటీ ఎన్నిక

Kotagiri | సార్వజనిక్ దుర్గామాత నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Kotagiri | మండల కేంద్రంలో సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శ్రీ విఠలేశ్వర ఆలయంలో (Sri Vithaleshwara Temple) గ్రామస్థులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దుర్గామాత నవరాత్రుల కార్యక్రమాలపై చర్చించారు.

ప్రతి ఏడాది కూడా దుర్గామాత ఉత్సవాలు (Durga Mata Festival) ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కమిటీ సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.సాయి బాబా గౌడ్, ఉపాధ్యక్షుడిగా గోక శంకర్, నిరాడి భూమయ్య, మేత్రి భూమయ్య, ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి, కోశాధికారి సుధాకర్, సహ కోశాధికారి శ్రీకాంత్, సహాయ కార్యదర్శి సాయి గణేశ్​, వడ్ల విఠల్​ను ఎన్నుకున్నామన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడిగా సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది గ్రామస్థుల సహకారంతో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ ఏడాది అదేవిధంగా ఆలయ పూజారి విజయ్ మహరాజ్ ఆధ్వర్యంలో నిత్యపూజలు, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

Must Read
Related News