అక్షరటుడే, బోధన్: Election observer | మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ (nomination process) శుక్రవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు పత్రాలు సమర్పించేందుకు ఆయా నామినేషన్ సెంటర్లకు తరలివస్తున్నారు. దీంతో సెంటర్ల వద్ద కోలాహలం ఏర్పడింది.
Election observer | బోధన్ పట్టణంలో..
బోధన్‌లో (Bodhan) ఏర్పాటు చేసిన రెండు నామినేషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్లను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహతోతో (Bodhan Sub-Collector Vikas Maah) కలిసి పరిశీలించారు. నామినేషన్ స్వీకరణలో తప్పులు లేకుండా అన్ని పత్రాలను పరిశీలించాలని ఆర్వోలకు సూచించారు. నామినేషన్ (nominations) స్వీకరణ సందర్భంగా అవకతవకలు జరగకుండా చూసుకోవాలన్నారు.
Election observer | అప్రమత్తంగా ఉండాలి..
ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ అధికారులు ఎన్నికలు పూర్తయ్యేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే ఉన్నతాధికారులకు సంప్రదించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రిపోలింగ్ జరిగితే పూర్తి బాధ్యత ఉన్నాధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నియమనిబంధనలను పక్కాగా పాటించాలని సూచించారు.