Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్​

Collector Nizamabad | ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్​

ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మాక్లూర్ మండలం గుత్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Collector Nizamabad | ఎన్నికల కమిషన్ నిబంధనలు (Election Commission rules) పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. మాక్లూర్ మండలం (Makloor Mandal) గుత్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Collector Nizamabad | నామినేషన్ల వివరాల ఆరా..

నామినేషన్ ఫారంలు, రిజిస్టర్లను కలెక్టర్​ పరిశీలించారు. మొదటి రోజు సర్పంచ్, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సర్పంచ్, వార్డు (Sarpanch and Ward) స్థానాలకు వచ్చిన నామినేషన్ల వివరాలను వెంటవెంటనే రోజు వారీగా ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాలని అన్నారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్​డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

Must Read
Related News