Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలి

Nizamabad CP | ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కమ్మర్​పల్లి పోలీస్​స్టేషన్​ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad CP | ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశించారు. కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను (Kammarpally Police Station) ఆదివారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు, లోకేషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని తప్పనిసరిగా సందర్శించి, అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలన్నారు.

అనంతరం స్టేషన్‌లో పలు రికార్డులు పరిశీలించారు. కేసుల పురోగతి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. సైబర్‌ నేరాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట భీమ్‌గల్‌ సీఐ సత్యనారాయణ, కమ్మర్‌పల్లి ఎస్సై అనిల్‌ రెడ్డి ఉన్నారు.