అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Laxmi Kantha Rao | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Laxmikantha Rao) కోరారు. మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు ఉషా సంతోష్ మేస్త్రిని గెలిపించాలని కోరారు. ముందుగా మండల కేంద్రంలో అన్నాబావు సాఠే విగ్రహానికి, గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Mla Laxmi Kantha Rao | బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం..
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదిహేనేళ్లుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక మద్నూర్‌లో సీసీ రోడ్ల కోసం రూ.1.20కోట్లు మంజూరు చేశానన్నారు. రెండేళ్లలో మద్నూర్ మండల కేంద్రానికి 112 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించానని వెల్లడించారు. జుక్కల్ నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం హన్మంత్ షిండే అసమర్థతతో నిజామాబాద్‌కు వెళ్లిందన్నారు. తాను తిరిగి మద్నూర్‌కు తీసుకొచ్చానన్నారు. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.