3
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది.
తాడ్వాయి (Tadwai mandal) మండలం ఎర్రపహాడ్ (Errapahad) గ్రామానికి చెందిన అనసూయ(60) అనారోగ్యంతో కామారెడ్డి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని తిరుగుప్రయాణంలో భర్త, కోడలితో కలిసి ఎర్రపహాడ్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. బస్సు దేవునిపల్లి (Devunipalli) )గ్రామానికి చేరుకోగానే అనసూయ ఛాతిలో నొప్పిగా ఉందంటూ పడిపోయింది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో జీజీహెచ్(GGH)కు తరలించగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలి ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉన్నారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.