Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ఆస్పత్రిలో వృద్ధురాలు మృతి.. ఆమె మెడలోని బంగారం గొలుసు చోరీ!

Nizamabad City | ఆస్పత్రిలో వృద్ధురాలు మృతి.. ఆమె మెడలోని బంగారం గొలుసు చోరీ!

వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందుతూ ​మృతి చెందింది. అయితే ఆమెపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైంది. ఈ ఘటన నగరంలోని ప్రైవేట్​ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతిచెందగా.. ఆమెపై ఉన్న బంగారు గొలుసు చోరీకి (gold chain theft) గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నగరంలోని హైదరాబాద్​ రోడ్​లో ఉన్న ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో (private hospital) చోటు చేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హైదరాబాద్​ రోడ్డు​లోని ఓ ప్రముఖ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలు గుండె సంబంధిత వ్యాధితో చేరింది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరగా.. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది. అయితే ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందే గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News