అక్షరటుడే, డిచ్పల్లి:Dichpalli Railway Station | రైలు కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన డిచ్పల్లిలో (Dichpalli) బుధవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని దుస్గాం గ్రామానికి చెందిన రామసాయవ్వ(67) ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. డిచ్పల్లి వద్ద రైల్వేస్టేషన్లో (Railway) నుంచి బయటకు వచ్చేందుకు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.