అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మీవద్ద గంజాయి ఉందనే అనుమానాలున్నాయి.. తనిఖీలు చేయాలని పేర్కొంటూ వృద్ధుడిని దుండుగులు దోచుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad district) కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.
Nizamabad City | నాందేవ్వాడలో..
మూడో టౌన్ ఎస్‌హెచ్‌వో హరిబాబు (SHO Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మూడోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాందేవ్వాడలో ఇద్దరు దుండగులు గంజాయి కోసం తనిఖీలు చేస్తున్నామంటూ హడావుడి చేశారు. ఈ క్రమంలో నాందేవ్‌వాడకు చెందిన రాములు అనే వృద్ధుడి బైక్‌ను ఆపారు. గంజాయి కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ఆయనను నమ్మించి యాక్టీవా డిక్కీని తెరిపించారు. అందులో తనిఖీ నిర్వహించినట్లుగా నటించిన వారు.. ఏమీ లేకపోవడంతో ఎలాగైనా ఆయన వద్ద ఉన్న బంగారు గొలుసు (gold chain) ఉంగరాన్ని కాజేయాలని ప్లాన్ వేశారు.
Nizamabad City | చైన్‌స్నాచింగ్ ఘటనలు పెరిగాయని చెప్పి..
చైన్ స్నాచింగ్ (chain snatching) ఘటనలు పెరిగిపోయాయని ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసి డిక్కీలో పెట్టుకోవాలని రాములుకు సూచించారు. వారి మాటలు నమ్మిన ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, వేలికి ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని తీసి డిక్కీలో పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఇంతలో తామే డీక్కీలో భద్రంగా పెడతామని అతని నమ్మించి బంగారు గొలుసుతో పాటు ఉంగరాన్ని కాజేసి అక్కడి నుండి పరారయ్యారు. వెంటనే తేరుకున్న ఆయన డిక్కీలో చూడగా బంగారు గొలుసు, ఉంగరం కనిపించలేదు. దీంతో వెంటనే బాధితుతు మూడోటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మూడోటౌన్ ఎస్సై హరిబాబు వెల్లడించారు.