అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Guntur | ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా (Guntur district) మందడంలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి నారాయణను (Minister Narayana) నిలదీస్తూ ఓ వృద్ధుడు గుండెపోటుతో కుప్ప కూలాడు.
వివరాల్లోకి వెళ్తే.. మందడంలో రహదారి అలైన్‌మెంట్‌పై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన రామారావు (70) ఆయనను నిలదీశారు. మీకు మా స్థలాలు ఇచ్చి బొచ్చెలు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందని.. మంత్రి నారాయణ చెప్పడంతోనే తమకు వాగుల్లో ప్లాట్లు ఇచ్చారని రామారావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మంత్రితో మాట్లాడుతుండగా రామారావుకు గుండెపోటు (heart attack) వచ్చింది.
Guntur | సీపీఆర్ చేసినా..
రామారావు కుప్పకూలడంతో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది సీపీఆర్ చేశారు. వెంటనే సమావేశాన్ని రద్దు చేసి మంత్రి కాన్వాయ్‌లో (minister convoy) వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో రామారావు చనిపోయినట్లు నిర్ధారించారు. రాములు కుటుంబ సభ్యులను మంత్రి నారాయణ పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా రామారావుకు గతంలో బైపాస్ సర్జరి జరిగినట్లు స్థానికులు తెలిపారు.