113
అక్షరటుడే, బోధన్: Panchayat Elections | తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో (local body elections) ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం ఓటర్లు వచ్చి తమ స్వగ్రామాల్లో ఓటు వేస్తున్నారు.
Panchayat Elections | ఆస్పత్రి నుంచి ఓటింగ్ కేంద్రానికి..
సాలూరు మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) ఓ వృద్ధుడు ఓటు విలువను తెలియజేశాడు. గ్రామానికి చెందిన వృద్ధుడు ఎన్నికల ముందు ప్రమాదం జరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన గురువారం పోలింగ్ సందర్భంగా అంబులెన్స్‌లో నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. పంచాయతీ సిబ్బంది సహకారంతో ఓటువేశాడు. ఆంబులెన్స్‌లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నాడు.