అక్షరటుడే, వెబ్డెస్క్ :Hyderabad | హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్(Rajendra Nagar)లో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమార్చారు.
రాజేంద్రనగర్లో Rajendra Nagar నివసించే షేక్ అబ్దుల్లా, రిజ్వానా ఎస్బీఐ(SBI)లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. శుక్రవారం వారు ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యాభర్తలను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఇంట్లో నగలు, డబ్బు దోచుకు వెళ్లారు. ఇది దోపిడీ దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి తరలించిన పోలీసులు, నిందితుల కోసం సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు.
