అక్షరటుడే, బాన్సువాడ: Elamanchili Srinivasa Rao| కాంగ్రెస్లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు (President of the Joint State MPTCs Forum, Elamanchili Srinivas Rao) ఎలమంచిలి శ్రీనివాస్ రావును అధిష్టానం సస్పెండ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్సువాడ నియోజకవర్గం (Banswada Constituency) వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆయన పార్టీకి నష్టం చేకూర్చే విధంగా పనిచేస్తున్నాడని పేర్కొంటూ గతంలో అధిష్టానం నోటీసులిచ్చింది. అయితే నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి(Chinna Reddy, Chairman of Telangana Congress Party State Disciplinary Committee) ఉత్తర్వులిచ్చారు.
కాగా.. బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వేర్వేరు వర్గాలుగా విడిపోయారు. దీంతో పార్టీ నేతలు, నాయకులు వర్గాలుగా ఏర్పడి అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.