అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Corporation Commissioner Dilip Kumar) తెలిపారు. నగరంలోని మినీ ట్యాంక్ బండ్లో ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాథ్ శ్రమదాన్ (Ek Din.. Ek Ganta.. Ek Saath Shramadan) కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు ప్రతిఒక్కరూ సమయం కేటాయించాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేస్తూ మున్సిపల్ వాహనాల్లోనే (municipal vehicles) వేయాలని కోరారు.
అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనే ఆదేశించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, యువత, సంఘాలు పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవిబాబు, సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు, ఎంఐఎస్ ఆపరేటర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.