అక్షర టుడే, వెబ్‌డెస్క్: Stock Markets | గత ఎనిమిది సెషన్లు(8 Sessions)గా లాభాల బాటలో పయనిస్తున్న నిఫ్టీకి బ్రేకులు పడ్డాయి. సోమవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ సైతం ఐదు సెషన్ల తర్వాత నష్టాలను చవి చూసింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 21 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 4 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి.
రోజంతా స్వల్ప ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. సెన్సెక్స్ 81,744 నుంచి 81,998 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,048 నుంచి 25,138 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 118 పాయింట్ల నష్టంతో 81,785 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 25,069 వద్ద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | మిశ్రమంగా సూచీలు..
రియాలిటీ(Realty), ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ బ్యాంక్, టెలికాం రంగాల షేర్లు రాణించగా.. ఐటీ, హెల్త్‌కేర్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్ 2.47 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.64 శాతం, ఇన్‌ఫ్రా 0.62 శాతం, ఇండస్ట్రియల్ 0.61 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.61 శాతం, టెలికాం 0.53 శాతం, పవర్ 0.51 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్(IT index) 0.63 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.50 శాతం, హెల్త్‌కేర్ 0.45 శాతం, ఆటో ఇండెక్స్ 0.32 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగ్గా.. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం తగ్గింది.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,330 కంపెనీలు లాభపడగా 1,889 స్టాక్స్ నష్టపోయాయి. 170 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 149 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 64 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 0.68 శాతం, ఎటర్నల్ 0.58 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.46 శాతం, ఎల్‌టీ 0.33 శాతం, రిలయన్స్ 0.32 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
ఎంఅండ్‌ఎం 1.67 శాతం, ఆసియా పెయింట్ 1.66 శాతం, ఇన్ఫోసిస్ 1.15 శాతం, టైటాన్ 1.14 శాతం, సన్‌ఫార్మా 0.85 శాతం నష్టపోయాయి.