అక్షరటుడే, లింగంపేట: Lingampeta mandal | పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలంలోని (Lingampeta mandal) బానాపూర్ గ్రామ శివారులో జూదమాడుతున్నట్లు అందిన సమాచారం దాడులు చేశామన్నారు.
అక్కడ ఎనిమిది మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుండి ఐదు బైక్లు, 5 సెల్ఫోన్లు, రూ.3,400 నగదు పట్టుబడినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవరైనా జూదమాడుతున్నట్లు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు.
