Homeతాజావార్తలుEggs | ఫ్రిజ్‌లో గుడ్లను స్టోర్​ చేస్తున్నారా.. అయితే జరిగేదేమిటో తెలుసుకోవాల్సిందే..!

Eggs | ఫ్రిజ్‌లో గుడ్లను స్టోర్​ చేస్తున్నారా.. అయితే జరిగేదేమిటో తెలుసుకోవాల్సిందే..!

eggs | ఫ్రిజ్​లో ఎగ్స్​ను స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు.. వారు చెప్పిన విషయాలు ఏమిటో ఓసారి చూద్దామా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Eggs | గుడ్లను నిల్వ చేసే విధానంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. బ్యాక్టీరియా Bacterial పెరగకుండా నివారించడంలో శీతలీకరణ (ఫ్రిజ్‌లో పెట్టడం) ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుడ్డును కడిగారా.. లేదా అనే  అంశంపై దాని నిల్వ పద్ధతి ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.

Eggs | శీతలీకరణ (ఫ్రిజ్‌లో పెట్టడం) ఎందుకు ముఖ్యం?

బ్యాక్టీరియా పెరుగుదల: ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, గుడ్లను సాధారణ ఉష్ణోగ్రత (25 డిగ్రీ సెంటిగ్రేడ్) వద్ద ఉంచితే సాల్మొనెల్లా టైఫిమురియం Salmonella Typhimurium వంటి బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుందట. ఫ్రిజ్‌లో ఉంచడం (రిఫ్రిజిరేషన్ refrigeration) వల్ల ఈ పెరుగుదల గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.

USDA సిఫార్సు: అమెరికా వంటి దేశాల్లో గుడ్లను 4 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలని సూచిస్తారు.

Eggs | క్యూటికల్ (సహజ రక్షణ పొర) పాత్ర:

USA లో: యునైటెడ్ స్టేట్స్ వంటి కొన్ని దేశాలలో గుడ్లను విక్రయానికి ముందు కడుగుతారు. ఈ ప్రక్రియ గుడ్డు పైభాగంలో ఉండే సహజ రక్షణ పొర అయిన క్యూటికల్‌ను తొలగిస్తుంది. ఈ పొర లేకపోవడం వల్ల, బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే శీతలీకరణ తప్పనిసరి.

యూరప్, ఆసియాలో: యూరోపియన్ European, ఆసియా దేశాల్లో గుడ్లను సాధారణంగా కడగకుండా అమ్ముతారు. దీనివల్ల క్యూటికల్ చెక్కుచెదరకుండా ఉండి, గుడ్డును బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. కాబట్టి, ఇక్కడ ఫ్రిజ్‌లో పెట్టడం ఎల్లప్పుడూ తప్పనిసరి కాదు (కానీ చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి).

ఉష్ణోగ్రత స్థిరత్వం ప్రధానం: గుడ్లను ఫ్రిజ్‌లోపల, బయట తరలించడం వల్ల పెంకుపై నీటి ఆవిరి (తేమ) ఏర్పడుతుంది. ఈ తేమ బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా మారుతుంది. అందుకే నిల్వ చేసేటప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా చూసుకోవాలి.

నిల్వ చిట్కా: గుడ్లను ఫ్రిజ్ డోర్‌కు బదులుగా లోపలి భాగంలో, వాటి అసలు కార్టన్‌లోనే ఉంచండి.

తాజాదనం, రుచి: రిఫ్రిజిరేషన్ వల్ల గుడ్ల రుచి మారుతుందని చాలామంది భావిస్తారు. కానీ, చల్లగా ఉంచడం వల్ల వాటి సహజ తాజాదనం ఎక్కువ కాలం నిలిచి ఉంటుందట. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు ప్యాకింగ్ తేదీ నుంచి ఐదు వారాల వరకు తాజాగా ఉంటాయి.

కడిగిన గుడ్లను కొనుగోలు చేసినా లేదా వేడి వాతావరణంలో ఉన్నా, వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. సురక్షితంగా, తాజాగా ఉంచడానికి స్థిరమైన, చల్లని ఉష్ణోగ్రతే అత్యంత ముఖ్యమైన నియమం.

Must Read
Related News