అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi reddy | నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు (Town journalist) నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) హామీ ఇచ్చారు.
ఈ మేరకు జర్నలిస్టు నాయకులు ఎమ్మెల్యేను శనివారం కలిశారు. నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. 81 సర్వే నెంబరు స్థలాన్ని ఇవ్వాలని జర్నలిస్టులు కోరగా భూపతిరెడ్డి సానుకులంగా స్పందించారు. అందరికీ ఇచ్చేందుకు వీలుగా నగర పొలిమేరలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆర్డీవోకు ఆదేశాలు ఇస్తామని ఆయన చెప్పారు.