అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బ్రిజేష్ (Dr. Brijesh) తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj College) శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే బదిలీలు, కెరీర్ అడ్వాన్స్ స్కీం (Career Advancement Scheme) తదితర సమస్యలను పరిష్కరించామని వివరించారు. అనంతరం ఆయనను అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు దండు స్వామి, రంగరత్నం, భరత్రాజ్, ముత్తెన్న, రాజేష్, చంద్రశేఖర్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.