Homeజిల్లాలునిజామాబాద్​Consumer Federation | వినియోగదారుల్లో చైతన్యం పెంచేందుకు కృషి

Consumer Federation | వినియోగదారుల్లో చైతన్యం పెంచేందుకు కృషి

వినియోగదారుల్లో చైతన్యం పెంచేందుకు భారత వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణి అన్నారు. హైదరాబాద్​లో సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Consumer Federation | వినియోగదారుల్లో చైతన్యం పెంచేందుకు భారత వినియోగదారుల సమాఖ్య నిర్మాణాత్మ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణి తెలిపారు. హైదరాబాద్​లోని మాసాబ్ ట్యాంక్ (Masab Tank) రెడ్​క్రాస్ భవన్​లో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల పక్షాన నిలబడి వారికి అండగా రూపొందించబడిన చట్టాలు.. వ్యాపార ఉత్పత్తిదారుల అజామాయిషీతో నీరుగారి పోతున్నాయన్నారు. జాతీయస్థాయిలో వినియోగదారుల ఉద్యమ ప్రతినిధులకు నాయకత్వం వహిస్తున్న సీసీఐ చట్టాల (CCI Acts) రూపకల్పనలో కీలక భూమి నిర్వహించాల్సిన తరణం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగానే సీసీఐ జోనల్ ఇన్​ఛార్జీల నియామకం చేపట్టిందన్నారు. తెలంగాణలో ఐదు జోన్లను ఏర్పాటు చేసి సీనియర్ వినియోగదారుల ఉద్యమ ప్రతినిధులను, రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీసీఐ సభ్యులతో కమిటీలను ప్రకటించిందన్నారు.

సమావేశంలో సీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్​రెడ్డి, సెక్రెటరీ జనరల్ సుదర్శన్, జాతీయ కౌన్సిల్ (CCI National Council) సభ్యుడు డాక్టర్ హరిప్రియ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుప్రభాహత్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్, రంజిత్ కుమార్, ప్రవీణ్, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ప్రవీణ, రంగన్న, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Consumer Federation | జోనల్ ఇన్​ఛార్జీల నియామకం

వరంగల్ ఇన్​ఛార్జీగా శ్రవణ్ కుమార్, నల్గొండ జోనల్ ఇన్​ఛార్జీగా యశ్వంత్ కుమార్, హైదరాబాద్ జోనల్ ఇన్​ఛార్జీగా ఏవీ రావు, మహబూబ్​నగర్​ జోనల్ ఇన్​ఛార్జీగా అనుదీప్​లను నియమించారు.

Must Read
Related News