Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | నేర రహిత కమిషనరేట్​గా మార్చేందుకు కృషి: సీపీ సాయిచైతన్య

Nizamabad CP | నేర రహిత కమిషనరేట్​గా మార్చేందుకు కృషి: సీపీ సాయిచైతన్య

కమిషనరేట్​ పరిధిలో నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నిజామాబాద్​ను నేరరహిత కమిషనరేట్​గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో చోరీలు జరిగితే రికవరీలు కష్టంగా ఉండేదన్నారు. దాడుల జరిగిన సంఘటనల్లో సైతం నిందితులను పట్టుకోవడం ఇబ్బందిగా మారేదని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందని స్పష్టం చేశారు.

Nizamabad CP | పెరిగిన జనాభా..

కమిషనరేట్​ పరిధిలో జనాభా పెరిగిందని సీపీ పేర్కొన్నారు. దీంతో పాటు సినిమా థియేటర్లు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయన్నారు. వీటితో పాటు నేరాల సంఖ్య పెరుగుతూ వచ్చిందన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కమిషనరేట్​ (commissionerate) పరిధిలో క్రైంరేటు తగ్గించేందుకు విశేషంగా కృషి చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

Nizamabad CP | సీసీ కెమెరాలు అమర్చుకోవాలి..

అయితే నేరాల నుంచి విముక్తి పొందాలంటే ప్రతిచోటా సీసీ కెమెరాలు (CCTV cameras) అమర్చుకోవాలని సీపీ పేర్కొన్నారు. దీంతో నేరం జరిగిన్పటికీ సొత్తు రికవరీ సులభమవుతుందన్నారు. అలాగే నిందితులును పట్టుకునే క్రమంలో పోలీసులు సీసీ పుటేజీలు ఉపయోగపడతాయని వెల్లడించారు. వ్యాపారసంస్థలు, విద్యాసంస్థల వద్ద ప్రతి పని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీ కేసులను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.