57
అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర ఆలయం (Sri Venkateswara temple) అభివృద్ధికి కృషి చేస్తానని భిక్కనూరు సర్పంచ్‌గా ఎన్నికైన బల్యాల రేఖ సుదర్శన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు. సర్పంచ్‌గా ఎన్నికైన రేఖను ఆలయ ఛైర్మన్ పబ్బ నాగరాజు ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పబ్బ నాగార్జున, కుర్రి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.