Shabbir Ali
Shabbir Ali | ఆలయాల అభివృద్ధికి కృషి

అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Shabbir Ali | ఆలయాల అభివృద్ధికి శాయాశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ Shabbir Ali పేర్కొన్నారు.

దోమకొండ (domakonda mandal) మండల కేంద్రంలోని చాముండేశ్వరి దేవి స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం దేవాలయ నూతన పాలకవర్గ సభ్యులు షబ్బీర్​ అలీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు తాటిపల్లి శ్రీకాంత్, తాటిపల్లి శ్రీధర్, స్వామి గౌడ్, అబ్రబోయిన స్వామి, శంకర్ రెడ్డి, సుధాకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.