అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Tour to Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేయాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బర్ధిపూర్ శివారులోని కేశాపూర్ వద్ద నిర్వహించిన సభకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
CM Tour to Nizamabad | నిజామాబాద్ కార్పొరేషన్‌కు నిధులివ్వాలి..
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ కార్పొరేషన్‌కు (Nizamabad Corporation) అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. జిల్లాలో జిల్లాలో ఎందరో పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాలని గుర్తు చేశారు. వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో వ్యవసాయ కళాశాల ఇచ్చారని తెలిపారు. అలాగే ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని తొందరలోనే జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే మూడు జిల్లాలకు మధ్యలో గెస్ట్ హౌస్ నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
CM Tour to Nizamabad | ఎంపీ అర్వింద్ ఏం చేశాడు..
ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడిన నిజామాబాద్ మున్సిపాలిటీ (Nizamabad Municipality) స్మార్ట్ సిటీగా ఎంపిక చేయకుండా కేంద్రం కరీంనగర్‌ను ఎంపిక చేసిందన్నారు. మరి ఈ సమయంలో ఎంపీ అర్వింద్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. దీంతోనే ఎంపీ పనితీరు ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి కార్పొరేషన్, మున్సిపాలిటీలను కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు.